For Money

Business News

బంగారం, వెండి.. భారీ నష్టాలు

కరెన్సీ, బాండ్లకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇవ్వడంతో ఈక్విటీ మార్కెట్‌తో పాటు బులియన్‌ మార్కెట్‌ కూడా బలహీనపడింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. పదేళ్ళ అమెరికా ట్రెజరీ బాండ్స్‌పై ఈల్డ్‌ 3 శాతం వైపు పరుగులు తీస్తోంది. అలాగే డాలర్ కూడా భారీగా పెరుగుతోంది. డాలర్ ఇండెక్స్ 104కు చేరువ అవుతోంది. ఈ నేపథ్యంలో బులియన్‌ చాలా బలహీనంగా మారింది. డాలర్‌తో రూపాయి మారకం విలువలో పెద్ద మార్పు లేకపోవడంతో … నష్టాలు తగ్గాయనే చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర రెండు శాతం క్షీణించింది. దీంతో ధర 1868 డాలర్లకు చేరగా, వెండి ధర 22.66 డాలర్లకు పడిపోయింది. ఇక మన మార్కెట్‌లో.. ఎంసీఎక్స్‌ ఫ్యూచర్‌ మార్కెట్‌లో… పది గ్రాముల జూన్‌ కాంట్రాక్ట్‌ రూ.981 తగ్గి రూ. 50773 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ ఒకదశలో రూ. 50481లకు కూడా పడింది. ఇక కిలో వెండి ధర జూన్‌ కాంట్రాక్ట్‌ రూ.1254 తగ్గి రూ. 63.095కి పడిపోయింది.