For Money

Business News

నీరసంగా వాల్‌స్ట్రీట్‌

వాల్‌స్ట్రీట్‌ ఇవాళ ఆరంభంలో పెరిగినా.. బాండ్‌ ఈల్డ్స్‌ దారుణంగా దెబ్బతీశాయి. పదేళ్ళ బాండ్‌ ఈల్డ్స్‌ రికార్డుస్థాయిలో 2.99 శాతం దాటాయి. భారీ నష్టాల తరవాత కూడా నాస్‌డాక్‌ ఇంకా డల్‌గా ఉంది. కొన్ని ప్రధాన టెక్‌స్టాక్స్‌ లాభాల్లో ఉన్నా… ఇతర షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అమెజాన్‌ ఇంకా నష్టాల్లో ఉంది. టెస్లా కూడా. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ ఇవాళ కూడా అర శాతం వరకు నష్టాల్లో ఉంది. అలాగే డౌజోన్స్‌ కూడా. ఇక కరెన్సీ మార్కెట్‌లో డాలర్ బలపడుతూనే ఉంది. డాలర్‌ ఇండెక్స్‌ 104వైపు పరుగులు పెడుతోంది.