For Money

Business News

స్టార్టప్స్‌ ర్యాంకింగ్‌… తెలంగాణ సూపర్‌

దేశంలో స్టార్టప్స్‌ను ప్రోత్సహించే టాప్‌ పెర్ఫార్మర్స్‌ రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ స్టార్టప్‌ స్టేట్‌ ర్యాంకులను విడుదల చేశారు. ఈ రంగంలో పెద్ద (కోటికిపైగా జనాభా), చిన్న (కోటిలోపు జనాభా) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చూపిన ప్రతిభ ఆధారంగా అయిదు విభాగాల్లో ర్యాంకింగ్స్‌ ప్రకటించారు. స్టార్టప్‌ మెగాస్టార్స్‌ (బెస్ట్‌ పెర్ఫార్మర్స్‌), సూపర్‌స్టార్స్‌ (టాప్‌ పెర్ఫార్మర్స్‌), స్టార్స్‌ (ది లీడర్స్‌), రైజింగ్‌ స్టార్స్‌ (యాస్పైరింగ్‌ లీడర్స్‌), సన్‌రైజర్స్‌ (ఎమర్జింగ్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్స్‌) కేటగిరీలుగా వీటిని విభజించారు. మెగాస్టార్స్‌లో గుజరాత్, కర్ణాటక టాప్‌లో ఉండగా, సూపర్‌ స్టార్స్‌లో తెలంగాణ ముందుంది. తరువాతి స్థానాల్లో కేరళ, మహారాష్ట్ర, ఒడిశా ఉన్నాయి. ఇక స్టార్స్‌ కేటగిరిలో తమిళనాడు టాప్‌లో ఉంది. తరువాతి స్థానంలో ఉత్తరాఖండ్‌, యూపీ, పంజాబ్‌, అసోమ్‌ ఉన్నాయి. ఇక రైజింగ్‌స్టార్స్‌లో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ టాప్‌ మూడుస్థానాలను ఆక్రమించాయి. ఇక సన్‌ రైజర్స్‌లో బీహార్‌ మొదటి స్థానంలో ఉండగా, తరువాతి స్థానంలో ఏపీ ఉంది.