For Money

Business News

టేకాఫ్‌కు ఆకాశ ఎయిర్‌ రెడీ

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా నెలకొల్పిన ఆకాశ ఎయిర్‌ నెలాఖరులో టేకాఫ్‌ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. సిబ్బంది యూనిఫారంను ఆవిష్కరిస్తూ… వాటి ఫోటలను కంపెనీ ట్వీట్‌ చేఉసింది. ఈ నెలాఖరుకు విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. గత నెల 21న సంస్థ తొలి బోయింగ్‌ 737 మాక్స్‌ విమానాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆకాశ ఎయిర్‌ కోసం మాత్రమే ప్రత్యేకంగా తయారుచేయించిన వస్త్రంతో సిబ్బందికి ట్రౌజర్లు, జాకెట్లు తయారుచేయించామని కంపెనీ తెలిపింది. మరోవైపు కొత్తగా ఆకాశ ఎయిర్‌ రావడం, టాటా గ్రూప్‌ కంపెనీ ఎయిర్‌ ఇండియా భారీ ఎత్తున రిక్రూట్‌మెంట్‌ జరుపుతుండటంతో విమాన సిబ్బంది, పైలెట్లకు ఎక్కడలేని డిమాండ్‌ వస్తోంది.