For Money

Business News

కేర్‌ చేతికి సీహెచ్‌ఎల్‌

హైదరాబాద్‌కు చెందిన కేర్‌ హాస్పిటల్స్‌ గ్రూపు ఇండోర్‌కు చెందిన సీహెచ్‌ఎల్‌ హాస్పిటల్స్‌ను కొనుగోలు చేసింది. ఒప్పందం విలువ రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల స్థాయిలో ఉంటుందని కేర్‌ వర్గాలు వెల్లడించాయి. CHL కార్డియాలజీ/కార్డియక్‌ సర్జరీ, న్యూరో సైన్స్‌, జీఐ, కాలేయ మార్పిడి, రెనాల్‌ సైన్స్‌, క్రిటికల్‌ కేర్‌ సేవలు అందిస్తోందని కేర్‌ పేర్కొంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో వైద్య సేవలను మరింత విస్తృత పరుచాలనే ఉద్దేశ్యంతో సీహెచ్‌ఎల్‌ హాస్పిటల్‌ను కొనుగోలు చేసినట్లు కేర్‌ హాస్పిటల్స్‌ గ్రూపు సీఈవో జస్‌దీప్‌ సింగ్‌ తెలిపారు. ఈ సందర్భంగా సీహెచ్‌ఎల్‌ హాస్పిటల్స్‌ సీఎండీ రాజేశ్‌ భార్గవ మాట్లాడుతూ..ఇండోర్‌లో అతిపెద్ద హాస్పిటల్స్‌లో ఒకటైన సీహెచ్‌ఎల్‌ హాస్పిటల్స్‌ను కేర్‌ కొనుగోలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.