For Money

Business News

SGX నిఫ్టి.. సానుకూలం

రాత్రి అమెరికా మార్కెట్లకు సెలవు. అయితే కరెన్సీ, ఇతర మార్కెట్లు పనిచేశాయి. డాలర్‌ ఇండెక్స్‌ 105 వద్ద నిలకడగా ఉంది. రాత్రి అనూహ్యంగా బాండ్‌ ఈల్డ్స్‌ రెండు శాతంపైగా పెరిగాయి. అయితే పదేళ్ళ బాండ్‌ ఈల్డ్ 3 శాతం లోపే ఉంది. అయితే నిన్న అరశాతంపైగా నష్టాల్లో ఉన్న అమెరికా ఫ్యూచర్స్‌ ఇవాళ ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ మళ్ళీ 115 డాలర్లకు చేరువైంది. నార్వేలో చమురు రంగ కార్మికులు సమ్మెకు దిగడంతో చమురు సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ముడి చమురు ధరలు పెరిగాయి. నిన్న యూరో మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. అయితే హెచ్చుతగ్గులు నామమాత్రంగానే ఉన్నాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్ల దాదాపు అన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. ప్రధాన సూచీలు ఒక శాతం వరకు లాభాల్లో ఉండటం విశేషం. హాంగ్‌సెంగ్‌ 1.6 శాతం, తైవాన్‌ 1.4 శాతం, కోస్పి 1.74 శాతం, జపాన్‌ నిక్కీ ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. మిగిలిన మార్కెట్లు నామమాత్రపు లాభాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 37 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి ప్రారంభమయ్యేసరికి పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండొచ్చు. సో… నిఫ్టి లాభాల్లో ప్రారంభం కానుంది.