For Money

Business News

LIC IPO: బంపర్‌ ఓపెనింగ్‌

ఎల్ఐసీ పబ్లిక్‌ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి అద్భుత ఆదరణ లభిస్తోంది. ప్రారంభమైన 3 గంటల్లోనే ఇష్యూలో 26 శాతం సబ్‌స్క్రయిబ్‌ అయింది. ముఖ్యంగా పాలసీ హోల్డర్స్‌ షేర్ల కోసం భారీ ఎత్తున దరఖాస్తు చేస్తున్నారు. పాలసీ హోల్డర్స్‌ కోసం కేటాయించిన షేర్లలో 89 శాతం షేర్లకు అపుడే దరఖాస్తులు వచ్చేశాయి. తాజా సమాచారం మేరకు ఈ భాగం సబ్‌స్క్రిప్షన్‌ దాదాపు పూర్తయింది. ఇక ఉద్యోగులు తమకు కేటాయించిన కోటాలో 43 శాతం షేర్లకు దరఖాస్తు చేశారు. ఇక రీటైల్‌ ఇన్వెస్టర్ల కోటాలో అపుడే 28 శాతానికి సమానమైన షేర్లకు దరఖాస్తులు వచ్చేశాయి. రీటైల్‌ ఇన్వెస్టర్లకు మొత్తం 9.02 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయగా, 12 గంటల సమయానికి 4.39 కోట్ల షేర్లకు దరఖాస్తు చేశారు.