For Money

Business News

ఆర్‌బీఐ టెన్షన్‌… భారీ నష్టాల్లో నిఫ్టి

ఆకస్మికంగా ఇవాళ రెండు గంటలకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఓ ప్రకటన చేస్తారని ఆర్బీఐ ప్రకటించడంతో షేర్‌ మార్కెట్‌ ఒక్కసారిగా టెన్షన్‌ నెలకొంది. ఉదయం 17100పైన ప్రారంభమైన నిఫ్టి మిడ్‌ సెషన్‌కు ముందు 16823 పాయింట్లకు కుప్పకూలింది. అక్కడి నుంచి స్వల్పంగా కోలుకుని ఇపుడు 16890 వద్ద ట్రేడవుతోంది. దాదాపు 180 పాయింట్ల నష్టంతో ఉంది. సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా నష్టపోయింది. అన్నింటికన్నా ముఖ్యంగా నిఫ్టి నెక్ట్స్‌ షేర్లలో భారీ ఒత్తిడి వస్తోంది. నిఫ్టి ఒక శాతం, నిఫ్టి బ్యాంక్‌ 0.5 శాతం నష్టపోగా… నిఫ్టి నెక్ట్స్‌ ఏకంగా 1.75 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఈ సూచీలో కూడా 50 షేర్లు ఉండగా, 43 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. జొమాటొ, అదానీ గ్రీన్‌, నౌకరీ, పిడిలైట్‌, డాబర్‌ వంటి షేర్లు నాలుగు నుంచి ఏడు శాతం వరకు నష్టపోయాయి. మిడ్‌ క్యాప్‌ నిఫ్టిలో ఓల్టాస్‌, డిక్షన్‌ భారీగా నష్టపోయాయి.