For Money

Business News

రాష్ట్రాల ఆదాయం రూ. 44,000 కోట్లు తగ్గుతుంది

పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్రాలు వ్యాట్ తగ్గించడం వల్ల వాటి ఆదాయం రూ.44,000 కోట్లు తగ్గుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. కేంద్రం తాను విధించిన సెస్‌ను పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ.10 మేర తగ్గించిన విషయం తెలిసిందే. దీని తరవాత పలు రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. నిజానికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గడం వల్ల ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాలకు కూడా ఆదాయం తగ్గింది. ఎందుకంటే వీటి గరిష్ఠ ధరపై వ్యాట్‌ వేస్తారు. గరిష్ఠ ధర తగ్గినపుడు ఆటోమేటిగ్గా రాష్ట్రాల వ్యాట్‌ ఆదాయం కూడా తగ్గుతంది. ఇది కాకుండా కొన్ని రాష్ట్రాలు అదనంగా వ్యాట్‌ తగ్గించాయి.