For Money

Business News

అమెరికా మార్కెట్లు.. ఆల్‌ గ్రీన్‌

చాలా రోజుల తరవాత అన్ని మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. వాల్‌స్ట్రీట్‌లో డౌజోన్స్‌ తప్ప నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. నిన్న భారీగా క్షీణించిన నాస్‌డాక్‌ ఇవాళ 0.7 శాతం లాభంతో ఉంది.ఇక కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ ఇండెక్స్‌ 0.2 శాతం పెరిగి 95ని దాటేసింది. డాలర్‌ పెరిగితే తగ్గాల్సిన కమాడిటీస్‌ అన్నీ గ్రీన్‌లో ఉండటం విశేషం. WTI క్రూడ్‌తో పాటు బ్రెంట్‌ క్రూడ్‌ కూడా అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. ఇక బులియన్‌ కూడా లాభాల్లో ఉంది. బంగారం 0.77 శాతం పెరగ్గా, వెండి దాదాపు రెండు శాతం లాభంతో ట్రేడవుతోంది.