For Money

Business News

లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

ద్రవ్యోల్బణ భయాల నుంచి అమెరికా మార్కెట్లు కాస్త కోలుకున్నాయి. డౌజోన్స్‌ మినహా నాస్‌డాక్‌, ఎస్‌ అండ్ పీ 500 సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. నాస్‌డాక్‌ అర శాతంపైగా లాభంతో పెరిగింది. డాలర్‌ చాలా పటిష్ఠంగా ఉంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ఒక్క జపాన్‌ నిక్కీ తప్ప మిగిలినవన్నీ బలహీనంగా ఉన్నాయి. ముఖ్యంగా చైనా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ స్థిరంగా ఉంది. సింగపూర్ నిఫ్టి 40 పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప లాభంతో ప్రారంభమయ్యే అవకాశముంది.