For Money

Business News

NIFTY TRADE: 17,900 కీలకం

నిఫ్టి ఇవాళ లాభాలతో ప్రారంభం అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిఫ్టి క్రితం ముగింపు 17,873. ఇవాళ నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17900 స్థాయిని అధికగమించే అవకాశముంది. 17,900 ఇవాళ మార్కెట్‌కు కీలకం. పైన ఉన్నంత వరకు మార్కెట్‌ గ్రీన్‌లోనే ఉంటుంది. తొలి ప్రతిఘటన 17,935 ప్రాంతంలో రావొచ్చు. ఈ స్థాయి దాటితే 17950 ప్రాంతంలో మరోసారి ఒత్తిడి రావొచ్చు. ఈ స్థాయికి వస్తే 17970 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మొచ్చు. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు 17950 ప్రాంతంలోనే అమ్మొచ్చు. నిఫ్టి మిడ్‌ సెషన్‌లోగా 17900కు రావొచ్చు. ఈ స్థాయి దిగువకు వస్తే 17,800 వరకు పెద్దగా మద్దతు లేదు. రిస్క్‌ వొద్దనుకునే వారు 17850 ప్రాంతంలోనే బయటపడొచ్చు. వీలైతే అధిక స్థాయిలో అమ్మి, దిగువ స్థాయిలో బయటపడొద్దు. పొజిషనల్‌ ట్రేడర్స్‌ దిగువస్థాయిలో కొనుగోలు చేయొచ్చు. డే ట్రేడర్స్‌ మాత్రం కొనుగోళ్ళకు దూరంగా ఉండటం బెటర్‌.