For Money

Business News

వెండికి భారీ డిమాండ్‌

అంతర్జాతీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం కన్నా వెండి భారీగా పెరుగుతోంది. పలు ఆర్థికవ్యవస్థలు బాగా రాణిస్తుండటంతో పారిశ్రామిక వర్గాల నుంచి వెండికి డిమాండ్‌ పెరుగుతోంది. ఇప్పటికే బులియన్‌ రేట్లు మూడు నెలల గరిష్ఠ స్థాయి వద్ద ఉన్నాయి. స్పాట్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 69,000 దాటింది. స్పాట్‌లో స్టాండర్డ్‌ బంగారం ధర రూ. 49,000 దాటింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం 1824 డాలర్ల వద్ద, వెండి 24.48 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్‌లో బంగారం 1815 డాలర్లపైన ఉన్నంత వరకు ఢోకా లేదని, ఈ స్థాయి దిగువకు చేరితే నష్టాలు భారీగా ఉంటాయని అనలిస్టులు అంటున్నారు. ఎంసీఎక్స్‌లో రాత్రి వెండి (డిసెంబర్‌ కాంట్రాక్ట్‌) రూ.593 లాభంతో రూ.64,925 వద్ద ముగిసింది. ఇన్‌ట్రా డేలో రూ. 65000 కూడా దాటింది. ఇక బంగారం (డిసెంబర్‌ కాంట్రాక్ట్‌) రూ. 48,050 వద్ద ముగిసింది. నిన్న కేవలం రూ.78 మాత్రమే పెరిగింది.