For Money

Business News

NIFTY TRADE: పెరిగితే అమ్మడమే

నిన్న దిగువ స్థాయిలో నిఫ్టికి మద్దతు లభించింది. 17800 బేస్‌గా నిఫ్టి ట్రేడవుతోంది. ఈ స్థాయికి పడినపుడల్లా మద్దతు లభిస్తోంది. నిఫ్టి క్రితం ముగింపు 18,068. ఇవాళ నిఫ్టి 18100ని దాటుతుందేమో చూడండి. తొలి ప్రతిఘటన ఈ స్థాయిలోనే రావొచ్చు. ఈ స్థాయిని దాటితే 18135, 18150 ప్రాంతంలో రావొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లు మరీ డల్‌గా ఉండటం, మన మార్కెట్‌ను ఉత్సాహపరిచే అంశాలు లేకపోవడంతో నిఫ్టి క్రితం స్థాయి నుంచి పెద్దగా ముందుకు సాగలేదని అనలిస్టులు అంటున్నారు. ఓపెనింగ్‌ స్థాయిలోనే అమ్మకాల ఒత్తిడి వస్తే… నిన్నటి మాదిరి… నిఫ్టి 18,000 వద్ద మద్దతు లభిస్తుందేమో చూడండి. ఇది కీలక స్థాయి మాత్రమే. మద్దతు మాత్రం 17,950 ప్రాంతంలో అందవచ్చు. సో.. నిఫ్టికి పై స్థాయిలో ఒత్తిడి వచ్చినా.. దిగువస్థాయిలో మద్దతు లభించవచ్చు. ఎందుకంటే టెక్నికల్‌గా నిఫ్టిపై పెద్ద ఒత్తిడి లేకపోవడమే.