For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లన్నీ స్తబ్దుగా ఉన్నాయి. అన్నీ గ్రీన్‌లో ఉన్నా…అన్నీ నామ మాత్రపు లాభాలతో ఉన్నాయి. రాత్రి వాల్‌స్ట్రీట్‌లో ప్రధాన సూచీలన్నీ గ్రీన్‌లో ఉన్నా… లాభాలు అంతంత మాత్రం. డౌజోన్స్‌ అత్యధికంగా 0.28 శాతం లాభంతో ముగిసింది. క్రూడ్‌ పెరుగుతూనే ఉంది. ఎక్కడా తగ్గే అవకాశం కన్పించడం లేదు. బులియన్‌ కూడా కాస్త స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా డల్‌గా ఉన్నాయి. చాలా వరకు మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా… అన్నీ నామ మాత్రపు లాభాలే. సింగపూర్ నిఫ్టి కూడా డల్‌గా ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టి కూడా స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.