For Money

Business News

ఈ పార్లమెంటు సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ బిల్లు!

ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ బిల్లు తేనుంది. గతంలో క్రిప్టో కరెన్సీని నిషేధించాలని కేంద్రం భావించింది. అయితే నిబంధనలతో అనుమతించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రతిపాదిత క్రిప్టోకరెన్సీ బిల్లుకు తుది రూపు ఇవ్వడంలో ఆర్థిక శాఖ అధికారులు బిజీగా ఉన్నారు. ఈనెల 29వ తేదీ నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల ప్రారంభంలోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఫాస్ట్‌ ట్రాక్‌ పద్ధతిలో క్రిప్టో కరెన్సీ బిల్లు ఆమోదం కోసం కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.