రూ. 9000 పెరిగిన వెండి
నిన్న భారీగా క్షీణించిన వెండి ఇవాళ మళ్ళీ లాభాల్లోకి వచ్చింది. ఇవాళ MCXలో ఓపెనింగ్‌లోనే కిలో వెండి ధర రూ. 9000 పెరిగింది. MCXలో రూ. 2,36,904 పలికిన తరవాత నిలకడగా ట్రేడవుతోంది. నిన్న ప్రపంచ వ్యాప్తంగా కమాడిటీ మార్కెట్లో వెండి ధరలు భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. లండన్ కమాడిటీ ఎక్స్ఛేంజీలో మార్జిన్స్‌ను కూడా భారీగా పెంచారు. దీంతో పతనం స్వల్పంగా తగ్గింది. అయితే అధిక స్థాయిలో ఎంత వరకు నిలదొక్కుకుంటుందో చూడాల్సి ఉంది. మరోవైపు బంగారం ధరలు కూడా స్వల్పంగా పెరిగింది. ఇవాళ MCXలో రూ. 1000 పెరిగి రూ. 1,33,799 వద్ద ట్రేడవుతోంది.
