For Money

Business News

ఏపీకి గుడ్‌ న్యూస్‌

ఆంధ్రప్రదేశ్‌లో బీపీసీఎల్‌ ఏర్పాటు చేయనున్న ఆయిల్‌ రిఫైనరీలో మరో ముందడుగు పడింది. ఈ రిఫైనరీలో వాటా తీసుకునేందుకు సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కో ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయిల్‌ ఇండియాతో పాటు ఆరామ్‌కో కూడా రిఫైనరీలో వాటా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలో 30 శాతం నుంచి 40 శాతం వాటాను ఇతరులకు ఇవ్వాలని బీపీసీఎల్‌ భావిస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తలను బట్టి చూస్తే ఆరామ్‌కో 20 శాతం, ఆయిల్ ఇండియా పది శాతం వాటా తీసుకునే అవకాశముంది. ఏపీలో రూ. లక్ష కోట్లతో ఆయిల్‌ రిఫైనరీ ఏర్పాటు చేస్తోంది.
నెల్లూరు వద్ద ఏర్పాటు కానున్న ఈ ఆయిల్‌ రిఫైనరీ ఫీజిబిలిటీ రిపోర్ట్‌ ఫిబ్రవరి కల్లా రెడీ అవుతుందని భావిస్తున్నారు.