For Money

Business News

రూ. 23,000 తగ్గిన వెండి

శుక్రవారం అమెరికా మార్కెట్లలో బులియన్‌ ధరలు ముఖ్యంగా వెండి ధరలు బాగా పెరిగాయి. ఔన్స్‌ వెండి ధర 80 డాలర్లు పెరిగింది. దీంతో మన మార్కెట్లలో వెండి ధర భారీగా పెరిగింది. ఒకదశలో కిలో వెండి ధర రూ. 2,54.783కు చేరింది. అయితే ఉదయం నుంచి అంతర్జాతీయ మార్కెట్లలో బులియన్‌లో కరెక్షన్‌ వచ్చింది. ఇపుడు అమెరికా మార్కెట్లలో వెండి అయిదు శాతం నష్టంతో ట్రేడవుతోంది. దీంతో మన మార్కెట్లలో కూడా వెండి ధర (2026 ఫిబ్రవరి కాంట్రాక్ట్‌) భారీగా తగ్గింది. ఇపుడు కిలో వెండి ధర రూ. 1.37,434 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్లలో ఇవాళ్టి గరిష్ఠ ధరతో పోలిస్తే వెండి ధర ఏకంగా రూ. 23,000 తగ్గింది. మరోవైపు బంగారం ధర కూడా క్షీణించింది. ఇవాళ ఉదయం పది గ్రాముల స్టాండర్డ్‌ బంగారం ధర రూ. 1,40,444 ఉండగా, ఇపుడు రూ. 1,37,151 వద్ద ట్రేడవుతోంది. అంటే ఇవాళ రూ. 3000లకుపైగా నష్టపోయిందన్నమాట.
500 శాతం లాభం
బులియన్‌ డెరివేటివ్ష్‌ మార్కెట్‌లో వెండి, బంగారం కాంట్రాక్ట్‌లను షార్ట్‌ చేసినవారికి ఇవాళ భారీ లాభాలు దక్కాయి. వెండి జనవరి 249000 కాంట్రాక్ట్‌ PE ఇవాళ రూ. 9,831కి పడిన తరవాత రూ. 22,500ల గరిష్టానికి తాకింది. కాని అసలు లాభాలు బంగారం షార్ట్‌ చేసినవారికి దక్కాయి. బంగారం రూ. 1,36,000 డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ PE ఇవాళ ఉదయం రూ. 61లకు పడగా.. ఇపుడు రూ. 1,376 గరిష్ఠ స్థాయిని తాకింది. డిసెంబర్‌ బంగారం రూ. 135000 PE కాంట్రాక్ట్‌ రూ. 20.50 నుంచి రూ. 915కి పెరిగింది. అంటే ఒకే రోజు 1000 శాతంపైగా లాభమన్నమాట. డిసెంబర్‌ కాంట్రాక్ట్‌లు అన్నీ ఇవాళే ముగింపు. . కేవలం ఒక సెషన్‌లో అనూహ్య లాభాలు పొందారు షార్ట్‌ కొట్టిన ట్రేడర్లు. ఇక బంగారం రూ. 1.36,000లకు చేరుతుందని CE కాంట్రాక్ట్‌లు కొన్నవారు షాక్‌ తిన్నారు. ఈ కాంట్రాక్ట్‌ విలువ ఇవాళ ఉదయం రూ. 2,296కి చేరి ఇపుడు రూ. 82కు పడింది. ఈ కాంట్రాక్ట్‌ నుంచి వెంటనే బయటపడని ఇన్వెస్టర్లు భారీ నష్టాలు పొందాల్సి వచ్చింది.