లాట్ సైజలు మారాయి
నిఫ్టి 50తో పాటు పలు సూచీలను ప్రాతినిధ్యం వహించే కాంట్రాక్టుల లాట్ సైజ్‌లను ఎన్‌ఎస్‌ఈ మార్చింది. కొత్త వీక్లీ లాట్‌సైజులు వెంటనే అమల్లోకి వస్తాయి. NSE50 నిఫ్టి లాట్ సైజ్‌ను 75 నుంచి 65కు తగ్గించింది. కొత్త లాట్ సైజ్ ఎక్స్‌పెయిరీ తేదీ జనవరి 6వ తేదీతో ప్రారంభమౌతుంది. ఇక మంత్లీ కాంట్రాక్ట్‌ల విషయంలో కొత్త కాంట్రాక్ట్‌లు జవనరి 27వ తేదీతో ముగుస్తాయి. వీటి లాట్‌సైజ్ కూడా మార్చారు. బ్యాంక్ నిఫ్టి లాజ్ సైజ్ 35 నుంచి 30కి, నిఫ్టి ఫైనాన్షియల్ సర్వీసెస్ (FinNifty) లాజ్ సైజ్ 65 నుంచి 60కి తగ్గించారు. అలాగే నిఫ్టి మిడ్ సెలెక్ట్ (Midcap Nifty)లాట్ సైజ్ 140 నుంచి 120కి తగ్గించారు. Nifty Next 50 లాట్‌సైజ్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
