For Money

Business News

25,900 దిగువకు నిఫ్టి

నిఫ్టి ఇవాళ అత్యంత కీలక స్థాయిలను పరీక్షించనుంది. ముక్యంగా 20 రోజల EMA స్థాయిని కాపాడుకుంటుందా లేదా అన్నది చూడాలి. క్లోజింగ్‌కల్లా నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప లాభాల్లో ట్రేడయ్యే అవకాశముందని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. ఇవాళ ఉదయం స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి కొద్ది నిమిషాల్లోనే 2900 స్థాయి దిగువకు చేరింది. ఇపుడు 60 పాయింట్ల నష్టంతో 25880 వద్ద ట్రేడవుతోంది.సెన్సెక్స్‌ 200 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టిలో టాప్‌ గెయినర్స్‌గా శ్రీరామ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌ పీవీ, హిందాల్కో, బీఈఎల్‌, అదానీ పోర్ట్స్‌ ఉన్నాయి. ఇక నష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో ఎటర్నల్‌ ముందుంది. తరువావతి స్థానాల్లో అపోలో హాస్పిటల్స్‌, ఐషర్‌ మోటార్స్‌, ఎల్‌ అండ్‌ టీ, జియో ఫైనాన్స్‌ ఉన్నాయి.