For Money

Business News

భారీ లాభాల్లో SGX NIFTY

అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లలో నాస్డాక్‌ 2.26 శాతం, ఎస్‌ అండ్‌ పీ 50 సూచీ 1.5 శాతం, డౌ జోన్స్‌ 1.17 శాతం లాభంతో ముగిశాయి. డాలర్‌ స్థిరంగా ఉండగా, క్రూడ్‌ ఆయిల్‌ అయిదు శాతం దాకా లాభపడింది. ఈ నేపథ్యంలోనూ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఇదే ట్రెండ్‌ ఆసియా మార్కెట్లలో కొనసాగుతోంది. జపాన్‌ నిక్కీ 1.25 శాతం, హాంగ్‌సెంగ్ 0.77 శాతం చొప్పున లాభంతో ట్రేడవుతున్నాయి. ఇతర సూచీలు ఒక శాతం దాకా లాభంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 140 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సో… నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 16200 స్థాయిని దాటనుంది.