For Money

Business News

అన్ని మార్కెట్లూ పెరగడం విశేషం

నాస్‌డాక్‌ 2 శాతం అప్‌
ఎస్‌ అండ్ పీ 1.12 శాతం జంప్‌
డౌజోన్స్‌ 0.77 శాతం పెరిగింది
10 ఏళ్ళ ప్రభుత్వ బాండ్లు 3 శాతం అప్‌
డాలర్‌ 0.05 శాతం పెరిగింది
క్రూడ్‌ ఆయిల్‌ 5 శాతం పెరిగింది
బంగారం పెరిగింది
వెండి అప్‌
కాపర్, సోయాబీన్‌, నేచురల్‌ గ్యాస్‌.. అన్నీ పెరిగాయి.
చాలా రోజుల తరవాత చిత్రమైన పరిస్థితి. అన్ని మార్కెట్లూ పెరుగుతున్నాయి. డాలర్‌ తక్కువగా పెరిగి డాలర్‌ ఇండెక్స్‌ 107 ప్రాంతంలోనే ఉంది. క్రూడ్‌ తగ్గినట్లే తగ్గి ఝలక్‌ ఇచ్చింది. ఏకంగా అయిదు శాతం పెరగడంతో బ్రెంట్‌ క్రూడ్‌ మళ్లీ 105 డాలర్లకు చేరింది. ఐటీ, టెక్‌ షేర్లలో రెండు శాతం లాభాలు రావడం విశేషం. టెస్లా,ఏఎండీ, ఎన్‌విడా వంటి షేర్లు నాలుగు శాతం పైగా పెరగ్గా, యాపిల్‌, అమెజాన్ రెండు శాతం వరకు పెరిగాయి. ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్ల పెంపు భయాల నుంచి మార్కెట్‌ బయటపడుతున్నట్లు తెలుస్తోంది. 0.5 శాతం వడ్డీని మార్కెట్‌ డిస్కౌంట్‌ చేసిందని అనలిస్టులు అంటున్నారు.