For Money

Business News

కొన్ని గంటల్లోనే 90 శాతం డౌన్‌

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఎండార్స్‌ చేసిన క్రిప్టో అసెట్‌ టోకెన్‌… గారి టోకెన్‌… కేవలం 24 గంటల్లోనే 90 శాతం క్షీణించింది. వదంతులు, తప్పుడు ట్రేడింగ్‌ పద్ధతుల కారణంగా ఈ టోకెన్‌ పతనమైనట్లు వార్తలు వస్తున్నాయి. గారి నెట్‌వర్క్ గారి టోకెన్‌ను విడుదల చేసింది. దీన్ని కంటెంట్‌ క్రియేటర్స్‌ అయిన చింగారి నిర్వహిస్తోంది. బుధవారం ఈ టోకెన్‌ 87 శాతం క్షీణించి 0.75 డాలర్ల నుంచి 0.1 డాలర్‌కు పడిపోయింది. గురువారం స్వల్పంగా కోలుకుని 0.132 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ కౌంటర్‌లో టర్నోవర్‌ కూడా సగానికి క్షీణించింది. ఇపుడు గారి నెట్‌వర్క్‌ మొత్తం మార్కెట్‌క్యాప్‌ 65 లక్షల డాలర్లకు పడిపోయింది. సొలానా బ్లాక్‌చైన్‌పై పనిచేసే చింగారి యాప్‌కు నేటివ్‌ టోకెన్ గారి టోకెన్‌. గూగుల్‌ ప్లే నుంచి చింగారి యాప్‌ను ఏకంగా 5 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.