For Money

Business News

బ్రిటన్‌ ప్రధాని రాజీనామా

తన కేబినెట్‌లోని మంత్రులందరూ రాజీనామా చేయడంతో బోరిస్‌ జాన్సన్‌ బ్రిటన్‌ ప్రధానిగా వైదొలిగారు. ఈ మేరకు డౌనింగ్‌ స్ట్రీట్‌ బయట ఆయన మాట్లాడుతూ …. వచ్చేవారం కొత్త ప్రధాని ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు. కొత్త ప్రధాని ఎంపిక పూర్తయ్యే వరకు తాను ప్రధానిగా కొనసాగుతానని… ప్రభుత్వం నడిపేందుకు తాను ఒక కేబినెట్‌ను ఏర్పాటు చేశానని అన్నారు. మూడేళ్ళు అధికారంలో ఉన్న బోరిస్‌ జాన్సన్‌ సహచర కేబినెట్‌ మంత్రుల ఒత్తిడి మేరకు వైదొలగక తప్పలేదు. ఉదయం నుంచి 50 మంది మంత్రులు రాజీనామా చేశారు. మరోవైపు ప్రధాని వెంటనే రాజీనామా చేసి. డిప్యూటీ ప్రధాని డొమినిక్‌ రాబ్‌కు బాధ్యతలు అప్పజెప్పాలని రాజీనామా చేసిన చాలా మంది మంత్రులు అంటున్నారు.