For Money

Business News

లాభాల్లో SGX NIFTY

గత శుక్రవారం అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. నాస్‌డాక్‌ ఏకంగా 1.88 శాతం లాభడగా, ఎస్‌ అండ్‌ పీ 1.42 శాతం లాభంతో ముగిసింది. ఇక డౌజోన్స్‌ లాభాలు 0.97 శాతానికే పరిమితమయ్యాయి. డాలర్‌ స్థిరంగా ఉంది. అలాగే క్రూడ్‌ కూడా. బ్రెంట్‌ క్రూడ్‌ 103 డాలర్ల పైనే ట్రేడవుతోంది. ఈవారం ఒపెక్‌ భేటీ ఉంది. ఇక ఆసియా మార్కెట్ల విషయానికొస్తే మిశ్రమంగా ఉన్నాయి. చైనా, హాంగ్‌సెంగ్‌ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా హాంగ్‌సెంగ్‌ 0.68 శాతం నష్టంతో ఉంది. అయితే జపాన్‌, న్యూజిల్యాండ్‌, ఆస్ట్రేలియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. సింగపూర్‌ నిఫ్టి ప్రస్తుతం 45 పాయింట్ల లాభంతో ఉంది. సో.. నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప లాభంతో ప్రారంభం కానుంది.