For Money

Business News

F&O: ఈ కౌంటర్లలో బుల్లిష్‌నెస్‌

కొత్త సెటిల్‌మెంట్ ప్రారంభ వారం కాబట్టి ఆప్షన్స్‌ డేటా దాదాపు అనేక లెవల్స్‌ వద్ద ఉంది. సాధారణంగా సెటిల్‌మెంట్‌ గడువు పెరిగే కొద్ది స్పష్టమైన లెవల్స్‌కు నిఫ్టి పరిమితమౌతుంది. ప్రస్తుతం కాల్‌ ఓపెన్‌ ఇంటరెస్ట్‌ 17500 స్ట్రయిక్‌ వద్ద అత్యధికంగా ఉంది. తరవాత 18000 స్ట్రయిక్‌ వద్ద ఉందని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌కు చెందిన చందన్‌ తపారియా అన్నారు. అలాగే అత్యధికంగా పుట్‌ ఓపెన్‌ ఇంటరెస్ట్‌16500 స్ట్రయిక్‌ వద్ద, 16000 స్ట్రయిక్‌ వద్ద ఉంది. మార్జినల్‌ కాల్ రైటింగ్‌ 17500 వద్ద, తరవాత 17300 వద్ద ఉంది. అలాగే పుట్‌ రైటింగ్‌ 16900, 16800 స్ట్రయిక్స్‌ వద్ద ఉంది. ఆప్షన్‌ డేటా చూస్తుంటే ట్రేడింగ్‌ రేంజ్‌ 16500 నుంచి 17500 మధ్య ఉండే అవకాశముంది.
బుల్లిష్‌ షేర్లు ఇవే..
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, శ్రీరేణుక సుగర్స్‌, ఎన్‌హెచ్‌పీసీ, ఇండియా ఎనర్జి ఎక్స్ఛేంజి, దేవయాని ఇంటర్నేషనల్‌, అంబుజా సిమెంట్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లలో MACD (Moving Average Convergence Divergence) మూమెంటమ్‌ బుల్లిష్‌గా ఉంది. అదే సూచీ నోసిల్‌, నిప్పాన్‌ లైఫ్‌ ఏఎంసీ, టిటాఘర్‌ వాగన్స్‌, జేకే లక్ష్మి సిమెంట్‌, విగార్డ్‌లలో బేరిష్‌ ధోరణి కన్పిస్తోంది.