For Money

Business News

స్థిరంగా సింగపూర్ నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు తీవ్రంగా హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఉదయం లాభాల్లోకి వచ్చిన సూచీలు… మధ్యలో భారీ నష్టాల్లోకి జారకున్నాయి. నాస్‌డాక్‌ మళ్ళీ ఒకశాతంపైగా నష్టపోయింది. అయితే క్లోజింగ్‌ సమయానికల్లా చాలా వరకు నష్టాలు పూడ్చుకున్నాయి. నాస్‌డాక్‌ అర శాతం నష్టంతో క్లోజ్‌ కాగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ మాత్రం 0.19 శాతం నష్టంతో క్లోజైంది. డౌజోన్స్‌ మాత్రం మొత్తం నష్టాలను కవర్‌ చేసుకుని… సరిగ్గా క్రితం ముగింపు వద్ద ముగిసింది. డాలర్‌ ఇండెక్స్‌ 105పైనే ఉంటోంది. బ్రెంట్‌ క్రూడ్‌ 78 డాలర్ల ప్రాంతంలో ఉంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ ఒక్కటే 1.6 శాతం లాభంతో ఉంది.చైనా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ 0.9 శాతం నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి పాతిక పాయింట్ల స్వల్ప నష్టాలతో ఉంది. సో… నిఫ్టి స్థిరంగా ప్రారంభం కానుంది. ఇవాళ మార్కెట్‌లో వీక్లీ సెటిల్‌మెంట్‌ క్లోజింగ్‌ ఉంది. అలాగే గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల ఓట్ల కౌంటింగ్‌ కూడా ఉంది.