For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లలో భారీ ర్యాలీ తరవాత అధిక స్థాయిలో లాభాల స్వీకరణ వస్తోంది. రాత్రి అమెరికా మార్కెట్లు నామ మాత్రపు లాభాలతో క్లోజ్‌ కాగా, ఆసియా మార్కెట్లలో లాభాల స్వీకరణ కన్సిస్తోంది. ముఖ్యంగా జపాన్‌, హాంగ్‌సెంగ్‌ సూచీలు ఒక శాతంపైగా నష్టంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు స్థిరంగా ప్రారంభమయ్యాయి. నిఫ్టి ప్రస్తుతం 35 పాయింట్ల నష్టంతో 19640 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 35 పాయింట్ల నష్టం పోయింది. నిఫ్టితో పాటు బ్యాంక్‌ నిఫ్టి, నిఫ్టి నెక్ట్స్‌ సూచీలు కూడా రెడ్‌లో ఉన్నాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ మాత్రం గ్రీన్‌లో ఉంది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్ కావడంతో నిఫ్టిలో ఒత్తిడికి ఛాన్స్‌ ఉంది. నిఫ్టి 35 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మున్ముందు ఈ నష్టాలు పెరిగే ఛాన్స్‌ ఉందని అనలిస్టులు అంటున్నారు. మిడ్‌ సెషన్‌ తరవాత నిఫ్టిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. నిఫ్టి 19500పైన కొనసాగినంత కాలం మార్కెట్‌కు ఢోకా లేదని విశ్లేషకులు అంటున్నారు.