For Money

Business News

రూపాయి ఢమాల్‌.. దేనికో…

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ బలపడలేదు.. క్రూడ్‌ ధరలు తగ్గుతున్నాయి… అయినా నిన్న డాలర్‌తో రూపాయి విలువ భారీగా క్షీణించింది. గత మూడు రోజుల్లో రూపాయి విలువ 124 పైసలు తగ్గడం ఫారెక్స్‌ మార్కెట్‌లో కలకలం రేపుతోంది. నిన్న ఒక్కరోజే డాలర్‌తో రూపాయి విలువ 65 పైసలు క్షీణింయి 82.5కి చేరింది. అమెరికాలో అధిక వడ్డీ రేట్ల కారణంగా స్టాక్‌ మార్కెట్‌ నుంచి పలు కంపెనీలు తమ పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్లు సమాచారం. డాలర్‌తో రూపాయి విలువ పడిపోవడంతో … తమ పెట్టుబడుల విలువ రోజురోజుకీ తీసికట్టుగా మారుతోందని విదేశీ ఇన్వెస్టర్లు అంటున్నారు. గతంలో 60 రూపాయలకు ఒక డాలర్‌ వచ్చేదని..ఇపుడు 82 చెల్లించాల్సి వస్తోందని అంటున్నారు. ఆ లెక్కన తమ పెట్టుబడులు 60 నుంచి 82 రూపాయలకు పెరిగినా తమకు లాభం లేదని వీరు అంటున్నారు. నవంబర్‌ నెల ఆరంభం వరకు కాస్త పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు ఇపుడు మళ్ళీ అమ్మకం బాట పట్టారు.