For Money

Business News

LEVELS : డే ట్రేడర్స్‌… పడితే కొనండి …

నిఫ్టి క్రితం ముగింపు 18660. సింగపూర్ నిఫ్టి 70 పాయింట్ల నష్టాన్ని చూపుతోంది. ఆ స్థాయి నష్టాలతో నిఫ్టి ప్రారంభం అవుతుందా అనేది అనుమానమే. నామ మాత్రపు లాభాలతో ప్రారంభం కావొచ్చని అనలిస్టులు భావిస్తున్నారు. ఒకవేళ అదే స్థాయి నష్టాలతో నిఫ్టి ప్రారంభమైతే… ట్రేడర్లకు గోల్డన్‌ ఛాన్స్‌ అని అంటున్నారు. నిఫ్టి బైజోన్‌ 18570-18600 మధ్య ఉన్నందున… ఈ స్థాయికి నిఫ్టి వస్తే 18550 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చని సీఎన్‌బీసీ ఆవాజ్‌ న్యూస్‌ ఛానల్ మేనేజింగ్‌ ఎడిటర్‌ అనూజ్‌ సింఘాల్‌ సలహా ఇస్తున్నారు. మార్కెట్‌ ఇటు భారీగా పడేందుకు లేదా భారీగా పెరిగేందుకు ప్రస్తుతానికి ఛాన్స్‌ లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. నిఫ్టి గనుక 18600 ప్రాంతంలో లేదా దిగువకు వస్తే కొనుగోలు చేయొచ్చని.. అయితే భారీ లాభాలతో కోసం ఆగకుండా 40-50 పాయింట్ల లాభంతో ట్రేడ్‌ చేసుకోవచ్చని ఆయన అన్నారు. నిఫ్టికి తొలి ప్రతిఘటన 18670 లేదా 18700 ప్రాంతంలో ఎదురు కానుందని అన్నారు.దిగువన కొనేవారు ఇక్కడ బయట పడొచ్చని సలహా ఇచ్చారు. నిఫ్టి షార్ట్‌ చేసేందుకు ఛాన్స్‌ తక్కువని అన్నారు. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ ట్రేడింగ్ ఉన్నందున నిఫ్టిలో హెచ్చుతగ్గులకు ఛాన్స్‌ ఉందని… ఇది ట్రేడర్లకు చిన్న చిన్న లాభాలు ఆర్జించేందుకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. 18700 స్థాయి పైకి వెళ్ళే బలం నిఫ్టిలో లేదని అనూజ్‌ సింఘాల్‌ సలహా ఇచ్చారు. బ్యాంక్‌ నిఫ్టిని కూడా షార్ట్‌ చేయొద్దని సలహా ఇచ్చారు. బ్యాంక్‌ నిఫ్టికి 43900 లేదా 43950 ప్రాంతంలో మద్దతు లభిస్తుందని అన్నారు. ఈ స్థాయిలో కొనేవారుఉ 43800 స్థాయిని స్టాప్‌లాస్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది. 44150ని గనుక బ్యాంక్‌ నిఫ్టి దాటితే వెంటనే 44300 స్థాయిని అందుకుంటుందని అన్నారు.