For Money

Business News

షియోమి ఆస్తుల జప్తు: ఐటీకి షాక్‌

చైనా మొబైల్‌ కంపెనీ షియోమికి చెందిన రూ. 3700 కోట్ల ఫిక్సెడ్‌ డిపాజిట్లను జప్తు చేస్తూ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులును కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. మనీలాండరింగ్‌ జరిగిందన్న ఆరోపణలతో చైనా కంపెనీ ఆస్తులను ఐటీ అధికారులు జప్తు చేశారు. దీన్ని కోర్టులో సియోమి సవాలు చేసింది. కావాలని తన కాంట్రాక్ట్‌ తయారీదారుల నుంచి అధిక ధరకు షియోమి స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసి తక్కువ లాభంతో అమ్మినట్లు లెక్కల్లో చూపుతోందని ఐటీ అధికారులు అంటున్నారు. దీంతో తక్కువ పన్నును కంపెనీ కడుతోందని ఆరోపిస్తూ ఆ కంపెనీకి చెందిన ఆస్తులను గత ఫిబ్రవరిలో జప్తు చేశారు. ఆ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసిందని రాయిటర్స్‌ వార్త సంస్త పేర్కొంది.