For Money

Business News

సింగపూర్‌ నిఫ్టి గ్రీన్‌లో

గత శుక్రవారం మన ఈక్విటీ మార్కెట్లు 0.79 శాతం నష్టాలతో ముగిశాయి. అలాగే యూరో మార్కెట్లు కూడా ఒక శాతంపైగా నష్టపోయాయి. ఆ రోజు రాత్రి అమెరికా మార్కెట్లు కూడా నష్టాలతో ముగిశాయి. ఎక్కడా గ్రీన్‌ మార్క్‌ కన్పించలేదు. డాలర్‌ ఇండెక్స్‌ 104పైన ఉండటమే గాక… ఈ ఒక్క పాజిటివ్‌ ట్రిగ్గర్‌ మార్కెట్‌కు అందలేదు. ఎక్కడ చూసిన మాంద్యంపైనే చర్చ. ఈ నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లలో తాజా పెట్టుబడులకు ఇన్వెస్టర్లు జంకుతున్నారు. ఇప్పటి వరకు టెక్‌ షేర్లకు పరిమితమైన అమ్మకాల ఒత్తిడి ఇపుడు ఎకానమీ షేర్లకు విస్తరించింది. నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు ఒక శాతం నష్టపోగా… డౌజోన్స్‌ కూడా 0.85 శాతం నష్టంతో ముగిసింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో నష్టాలే కన్పిస్తున్నాయి. జపాన్‌ నిక్కీ ఒక శాతంపైగా నష్టపోగా… హాంగ్‌సెంగ్‌ మాత్రం 0.37 శాతం లాభంతో ఉంది. చైనా మార్కెట్లు కూడా మిశ్రమంగా ఉన్నాయి. ఇతర మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నా… నష్టాలు ఒక మోస్తరుగా మాత్రమే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం సింగపూర్ నిఫ్టి 53 పాయింట్ల లాభంతో ఉంది. మరి మార్కెట్‌ ఓపెనింగ్‌ వరకు ఈ లాభాలు ఉంటాయా లేదా అన్నది చూడాలి. నిఫ్టి మాత్రం ఓపెనింగ్‌లో స్థిరంగా ఉండొచ్చు.