For Money

Business News

రూ.12,015 కోట్ల ట్రూ అప్‌ బాదుడు?

విద్యుత్ చార్జీలను పెంచడం లేదంటూ తీపి కబురు అందించిన తెలంగాణ డిస్కమ్‌లు ఇపుడు ట్రూఅప్‌ చార్జీల పేరిట రూ. 12,015 కోట్ల బాదుడుకు సిద్ధమైంది. తాము విద్యుత్ కొనుగోలుకు పెట్టిన ఖర్చు… సరఫరా చేసిన ధరకు మధ్య వ్యత్యాసం రూ. 12,015 కోట్లు ఉందని… దీనిని కస్టమర్ల నుంచి వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీకి విన్నవించాయి. 2016-17 నుంచి 2022-22023 వరకు తాము విద్యుత్‌ కొనుగోలు కోసం పెట్టిన ఖర్చు, సరఫరా చేసిన వివరాలను రెగ్యులేటరీ కమిషన్‌కు సమర్పించాయి. డిస్కమ్‌ల ప్రతిపాదనలపై బహిరంగ చర్చను జనవరి 18వ తేదీన రెగ్యులేటరీ కమిషన్‌ నిర్వహించనుంది. గడచిన 7 ఏళ్ళలో విద్యుత్‌ కొనుగోలు కోసం కమిషన్‌ అనుమతి ఇచ్చిన మొత్తం కంటే రూ. 29000 కోట్లు అధికంగా ఖర్చు పెట్టినట్లు డిస్కమ్‌లు పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 7961 కోట్లు అదనపు సాయం అందిందని, అలాగే రూ. 9236 కట్లు లాస్‌ ఫండింగ్‌ కింద ఇచ్చినట్లు డిస్కమ్‌లు తెలిపాయి. మిగిలిన మొత్తాన్ని వినియోగదారుల నుంచి ట్రూ అప్ చార్జీల రూపేణా వసూలుకు అనుమతి కోరుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల కింద డిస్కమ్‌లకు ఇంకా రూ.20,840 కోట్లు బకాయి ఉన్నట్లు డిస్కమ్‌లు వెల్లడించాయి. ఇందులో ఇరిగేషన్‌ పథకాల నుంచి రూ. 9200 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నాయి.