For Money

Business News

నష్టాల్లో SGX NIFTY

అంతర్జాతీయ మార్కెట్లు నిస్తేజంగా ఉన్నాయి. ఉత్సాహం క్రమంగా తగ్గుతోంది. క్రూడ్‌ ఆయిల్‌ తగ్గుతున్నా.. మార్కెట్లపై ప్రభావం పెద్దగా లేదు. అమెరికాలో క్రమంగా మాద్యం ఛాయలు కన్పిస్తోంది. టార్గెట్‌ షేర్‌ రాత్రి 13 శాతం క్షీణించింది. మైక్రాన్‌ షేర్‌ ఆరు శాతంపైగా క్షీణించింది. రీటైల్‌ మార్కెట్‌లో అమ్మకాలు బాగా క్షీణించడంతో రాత్రిడౌ జోన్స్‌ 0.12 శాతం నష్టంతో ముగిసింది.ఇక నాస్‌డాక్‌లో పతనం కొనసాగుతూనే ఉంది. సూచీ 1.54 శాతం క్షీణించగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.83 శాతం తగ్గింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. ప్రధాన మార్కెట్లన్నీ ఒక మోస్తరు నష్టాల్లో ఉన్నాయి. చైనా మార్కెట్లు దాదాపు ఒక శాతం వరకు నష్టపోగా, హాంగ్‌సెంగ్‌ 2.86 శాతం నష్టంతో ఉంది.ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 60 పాయింట్లకు పైగా నష్టంతో ఉంది. నిఫ్టి ఇవాళ నష్టాలతో ప్రారంభంకానుంది. పైగా ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ నేడు.