For Money

Business News

రెడ్‌లో సింగపూర్ నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. నాస్‌డాక్‌ పెద్దగా నష్టపోలేదు. కేవలం 0.4 శాతం నష్టంతో ముగిసింది. ఎస్‌ అండ్‌ పీ 500, డౌజోన్స్‌ సూచీలు మాత్రం 0.6 శాతం నష్టంతో ముగిశాయి. డాలర్‌ ఇండెక్స్‌ మళ్ళీ 102కి దగ్గరవుతోంది. ముడిచమురు రెండు శాతం దాకా తగ్గింది. దీంతో ఎనర్జీ షేర్లు దెబ్బతిన్నాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా… లాభనష్టాలు తక్కువే. చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. నిక్కీ అర శాతంపైగా లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టి 40 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ట్రేడింగ్‌ ప్రారంభమయ్యే సమయానికి ఇదే నష్టంతో లేదా స్థిరంగా నిఫ్టి ప్రారంభం కావొచ్చు.