For Money

Business News

18000 దిగువన SGX NIFTY

ఫెడరల్ రిజర్వ్‌ దెబ్బకు ఈక్విటీ మార్కెట్లు మరో సారి భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. రాత్రి ఫెడరల్‌ రిజర్వ్‌ 0.75 శాతం చొప్పున వడ్డీ రేట్లను పెంచింది. దీంతో రాత్రి వాల్‌స్ట్రీట్‌ భారీ నష్టాలతో ముగిసింది. నాస్‌డాక్‌ రాత్రి మళ్ళీ 3.36 శాతం నష్టపోయింది. అలాగే ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 2.50 శాతం నష్టంతో ముగిసింది.అయితే డౌజోన్స్‌ మాత్రం 1.55 శాతం నష్టంతో సరిపెట్టుకుంది. రాత్రి డాలర్, బాండ్‌ ఈల్డ్స్‌ భారీగా పెరిగాయి. డాలర్‌ ఇండెక్స్‌ మళ్ళీ 112 వైపు పరుగులు తీస్తోంది. మరోవైపు పదేళ్ళ అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ 4.11 శాతం దాటింది. ఆసియా మార్కెట్లలో దీని ప్రభావం కన్పిస్తోంది. జపాన్‌ మార్కెట్లకు ఇవాళ సెలవు. న్యూజిల్యాండ్‌, ఆస్ట్రేలియా, తైవాన్‌ మార్కెట్లు దాదాపు ఒక శాతం వరకు నష్టంతో ట్రేడవుతున్నాయి. హాంగ్‌సెంగ్ 2.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది.చైనా మార్కెట్ల నష్టాలు మాత్రం అర శాతం నుంచి ఒక శాతం మధ్య ఉన్నాయి. సింగపూర్‌ నిఫ్టి 160 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడవుతోంది. సో.. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 18000 దిగువన ప్రారంభం కావొచ్చు. పైగా ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కూడా.