For Money

Business News

NIFTY TRADE: పెరిగితే అమ్మండి

ఇవాళ పాజిటివ్స్‌ వరకు వస్తే.   ఇవాళ మెటల్స్‌ నుంచి మద్దతు కొనసాగనుంది. చైనా మార్కెట్లు కాస్త పాజిటివ్‌గా ఉన్నాయి. ఇక నెగిటివ్‌ విషయానికొస్తే నాస్‌డాక్‌ నష్టాలు. బలహీన ఫార్మాతో పాటు అదానీ గ్రూప్‌పై మళ్ళీ నీలినీడలు. ప్రధాన కార్పొరేట్‌ ఫలితాలు పూర్తి కావొస్తన్నాయి. చాలా వరకు కంపెనీలు నిరాశపర్చాయి. ఇక ఇవాళ్టి నిఫ్టి ట్రేడ్‌ విషయానికొస్తే నిఫ్టి క్రితం ముగింపు 15,746. నిఫ్టి 15,780-15,800 ప్రాంతంలో ప్రారంభం కావొచ్చు. నిఫ్టికి ఇవాళ తొలి ప్రతిఘటన 15,820 ప్రాంతంలో రావొచ్చు. 15,845 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మొచ్చు. రిస్క్‌ తీసుకునేవారు ఇంకా దిగువనే అమ్మొచ్చు. కాని 15,845 దాటితే అమ్మొద్దు. నిఫ్టి పడితే తొలి మద్దతు 15,770 ప్రాంతంలో అందాలి. లేనిపక్షంలో నిఫ్టి భారీగా పతనమయ్యే అవకాశముంది. ఎందుకంటే నిఫ్టికి దిగువ స్థాయిలో టెక్నికల్‌ మద్దతు ఉన్నా… అది15,680 ప్రాంతంలో ఉంది. ఫార్మా కంపెనీల్లో ఒత్తిడి కొనసాగితే ..బ్యాంక్‌ నిఫ్టి కూడా తోడైతే, నిఫ్టి ఈ స్థాయికి చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. డే ట్రేడర్స్‌ కనుక కొనుగోలు చేయాలంటే 15,660 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయండి. పరిస్థితి చక్కబడే వరకు కొనుగోళ్లకు దూరంగా ఉండటం మంచిది.