For Money

Business News

కోవిడ్‌ టాబ్లెట్లకు నేడు ఆమోదం?

అమెరికాకు చెందిన ఎంఎస్‌డీ, రిడ్జ్‌బ్యాక్‌ బయోథెరపిటిక్స్ కంపెనీలు కోవిడ్‌ ట్యాబ్లెట్‌ను అభివృద్ధి చేశాయి. వీటికి బ్రిటన్‌ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం కూడా లభించింది. వీటి తయారీ, అమ్మకానికి భారత్‌కు చెందిన పలు కంపెనీలతో ఎంఎస్‌డీ ఒప్పందం కూడా చేసింది. ఒప్పందం చేసుకున్న భారత కంపెనీలు కోవిడ్‌ ట్యాబ్లెట్‌- మోల్నుపిరవిర్‌- తయారీ కోసం ప్రభుత్వం అనుమతి కోరుతూ దరఖాస్తు చేశాయి. ద డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్ ఆఫ్‌ ఇండియా సదరు ప్రతిపాదనలను సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ (SEC)కి పంపింది. ఇవాళ ఈ కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించనుంది. దరఖాస్తు చేసుకున్న కంపెనీల్లో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్, నాట్కొ ఫార్మా, ఎంఎస్‌డీ, హెటిరో ల్యాబ్స్‌, అరబిందో ఫార్మా, ఆప్టిస్‌ ఫార్మా, స్ట్రయిడ్స్‌ ఫార్మా, ఎంఎస్‌ఎన్‌ ఫార్మా, బీడీఆర్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఉన్నాయి. ఇందులో అయిదు కంపెనీలు కన్సార్టియంగా ఏర్పడి దరఖాస్తు చేశాయి.