For Money

Business News

అదానీ ఇన్వెస్టర్లపై సెబీ దర్యాప్తు

తమ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసిన విదేశీ ఇన్వెస్టర్లపై కొన్ని మీడియా సంస్థలు కావాలని వార్తలు రాశాయని ఇటీవల జరిగిన ఏజీఎంలో అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఆరోపించారు. కాని పార్లమెంటులో కూడా అదానీ గ్రూప్‌ సంస్థలపై దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్టాక్ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి) తాజాగా అదానీ గ్రూప్‌ కంపెనీలలో పెట్టుబడి పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లపై దర్యాప్తు ప్రారంభించింది. అదానీ గ్రూప్‌నకు చెందిన ఆరు కంపెనీల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో (FPI) ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారు. ఈ పెట్టుబడుల అంతిమ యజమాని ఎవరు… అంటే ఎవరి తరఫున ఈ పెట్టుబడులు పెట్టారో తెలపాలని ఈ ఫండ్‌ల కస్టోడీయన్లకు సెబీ లేఖ రాసింది. అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజస్‌, అదానీ గ్రీన్‌, అదానీ పవర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ టోటోల్‌ గ్యాస్‌ కంపెనీల్లో ఎఫ్‌పీఐలు భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేశాయి. ఈ సంస్థలు ఎవరి తరఫున పెట్టుబడి పెట్టాయనే అంశంపై మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి.