For Money

Business News

నిఫ్టి: ఓపెనింగ్‌లోనే లాభాల పంట

నిఫ్టిని అమ్మినవారికి ఆరంభంలోనే లాభాలు అందాయి. బ్యాంక్‌, ఫార్మా రంగాల షేర్లు బలహీనపడటం ప్రారంభమయ్యాక… నిఫ్టి చాలా కూడా బాగా క్షీణిస్తోంది. ఇవాళ ఓపెనింగ్‌లోనే షార్ట్‌ సెల్లర్స్‌ ఆకర్షణీయ లాభాలు అందాయి. నిఫ్టికి ఓపెనింగ్‌లోనే వచ్చిన అమ్మకాల ఒత్తిడితో కొన్ని నిమిషాల్లో 15767 నుంచి 15,656 పాయింట్లకు క్షీణించింది. వంద పాయింట్ల పతనం. ఉదయం అనుకున్నట్లు నిఫ్టికి తొలి మద్దతు 15660 వద్ద అందింది. ఈ స్థాయిని కోల్పోతే నేరుగా 15,630కి, తరవాత 15550కి వెళ్ళే అవకాశముంది. భారీ నష్టం లేకపోయినా… 15,630ని తాకుతుందేమో చూడాలి. 15,680పైన నిలదొక్కుకుంటే తప్ప నిఫ్టికి మద్దతు అందడం కష్టం. మిడ్‌ క్యాప్‌ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది. బ్యాంక్‌ నిఫ్టి కూడా అరశాతం నష్టంతో ఉంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,000.10 2.49
కోల్‌ ఇండియా 143.35 0.63
ఐఓసీ 104.45 0.48
దివీస్‌ ల్యాబ్‌ 4,810.00 0.39
టెక్‌ మహీంద్రా 1,125.05 0.37

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
సిప్లా 898.25 -1.63
టాటా కన్జూమర్స్‌ 758.50 -1.46
గ్రాసిం 1,497.50 -1.40
హెచ్‌డీఎఫ్‌సీ 2,404.20 -1.22
నెస్లే ఇండియా 18,021.10 -1.12