బాబోయ్ ఇంకా పెరిగింది
అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ మార్కెట్ పరుగులు తీస్తోంది. ట్రంప్ సుంకాలపై కోర్టుల్లో చుక్కెదురు కావడంతో వాల్‌స్ట్రీట్ భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. ప్రధాన సూచీలన్నీ ఒకటిన్నర శాతంపైగా నష్టంతో ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్లదీ అదే పరిస్థితి. వృద్ధి రేటుపై అనేక దేశాల్లో అనుమానాలు వస్తున్నాయి. దాదాపు పాతికేళ్ళ గరిష్ఠ స్థాయికి యూరప్ బాండ్ ఈల్డ్ పెరిగింది. దీంతో షేర్ మార్కెట్ నుంచి ఇన్వెస్టర్లు బులియన్వైపు మళ్ళుతున్నారు. ఇవాళ అమెరికాలో వెండి, బంగారం ధరలు 2 శాతం పైగా పెరిగాయి. ఇవాళ మన మార్కెట్లో స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర రూ. 1,06,070లు పలికినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. అయితే మార్కెట్ క్లోజింగ్ తరవాత అమెరికా మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఈలెక్కన రేపు ఉదయం మరింత భారీ లాభాల్లో బులియన్ ప్రారంభమయ్యే అవకాశముంది. ఇక MCXలో 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర ఇవాళ రూ. 1,05,850 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ
MCXలో పది గ్రాముల బంగారం ధర రూ. 1,015 పెరిగింది. రాత్రి అమెరికా మార్కెట్లలో వచ్చిన మార్పులకు రేపు మన మార్కెట్లు స్పందించే ఛాన్స్ ఉంది.
