ఆసియా దేశాలకు క్రూడ్ ధరలు తగ్గింపు

అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో తన ఆసియా కస్టమర్లకు ధరలు తగ్గించాలని సౌదీ అరేబియా నిర్ణయించింది. తన ఎగుమతుల్లో దాదాపు 60 శాతం ముడి చమురును చైనా, దక్షిణ కొరియా, జపాన్, భారత్‌లకు ఎగుమతి చేస్తోంది. సౌదీ కంపెనీ ఆరామ్ కో నుంచి ఇవి ఎగుమతి అవుతాయి. ఆసియా మార్కెట్లు కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ఇపుడు 72 డాలర్ల ప్రాంతంలో ఉంది. సాధారణ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.30 డాలర్లు, ప్రీమియం క్రూడ్ ధరను 1.7 డాలర్ల మేరకు ఆరామ్‌కో తగ్గించినట్లు తెలుస్తోంది. బ్యారెల్‌కు 60 సెంట్లు వరకు తగ్గిస్తుందని భావించిన కొనుగోలు దారులకు… భారీ తగ్గింపుతో సౌదీ షాక్ ఇచ్చింది.