For Money

Business News

సత్య నాదెళ్లకు సీకే ప్రహ్లాద్‌ అవార్డు

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ, తెలుగు బిడ్డ సత్య నాదెళ్ల మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీ పురస్కారాన్ని అందుకున్నారు. కార్పొరేట్‌ ఎకో ఫోరం (సీఈఎఫ్‌) ఏటా ఇచ్చే సీకే ప్రహ్లాద్‌ అవార్డ్‌ ఫర్‌ గ్లోబల్‌ బిజినెస్‌ సస్టెయినబిలిటీ లీడర్‌షిప్‌’ అవార్డుకు నాదెళ్ల ఎంపికయ్యారు. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ ప్రెసిడెంట్‌, వైస్‌ చైర్మన్‌ బ్రాడ్‌ స్మిత్‌, చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌ అమి హుడ్‌, చీఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఆఫీసర్‌ లుకాస్‌ జొప్పాలతో కలిసి నాదెళ్ల ఈ అవార్డు అందుకున్నారు. కర్బన ఉద్గార రహిత కంపెనీగా మైక్రోసాఫ్ట్​ను తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషికి గాను వీరికి ఈ అవార్డు ఇస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ప్రైవేట్ రంగంలో అసాధారణ విజయాలు, సుస్థిరత సాధించిన వారికి వ్యాపార దిగ్గజం భారతీయ అమెరికన్​ సీకే ప్రహ్లాద్ పేరిట ఈ​ పురస్కారాన్ని కార్పొరేట్ ఎకో ఫోరమ్(సీఈఎఫ్​) సంస్థ 2010 నుంచి అందిస్తోంది. “నాదెళ్ల, హుడ్, స్మిత్, జుప్పా అద్భుతమైన యాజమాన్య పాత్ర పోషిస్తున్నారు. ఒకే సంస్థకు చెందిన నలుగురు వ్యక్తులు.. పర్యావరణ పరిరక్షణ దిశగా కృషి చేయడం ఇదే తొలిసారి” అని సీఈఎఫ్​ వ్యవస్థాపకుడు ఎంఆర్​ రంగస్వామి తెలిపారు.