For Money

Business News

రష్యా క్రూడ్‌ సరఫరాపై ఆంక్షలు షురూ…

రష్యా నుంచి క్రూడ్‌ దిగుమతులపై యూరోపియన్‌ యూనియన్‌ విధించిన ఆంక్షలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. రష్యా సరఫరా చేసే క్రూడ్‌ ఆయిల్ ధరను 60 డాలర్లుగా నిర్ణయించాయి యూరప్‌ దేశాలు. ఉక్రెయిన్‌పై మరింత జోరుగా దాడి చేయకుండా రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని ఈ దేశాల ప్రతిపాదన ఇది. దీని ప్రకారం ఎవరు దిగుమతి చేసుకున్నా బ్యారెల్‌ ధర 60 డాలర్లను దాటరాదు. ఒకవేళ ఏ దేశమైనా సరే తన అవసరాల కోసం 60 డాలర్ల కన్నా తక్కువకు డీల్‌ కుదుర్చుకుంటే.. ఆ దేశాలకు షిప్పింగ్‌తో పాటు ఇన్సూరెన్స్‌ ఉండదని యూరప్‌ దేశాలు ప్రతిపాదించాయి. దీంతో భారత్‌ వంటి దేశాలు ఇబ్బందుల్లో పడ్డాయి. 60 డాలర్లకన్నా తక్కువ డిస్కౌంట్‌కు ఆయిల్ కొనే వీలు ఉన్నా… రవాణా భయంతో మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు పాకిస్తాన్‌కు తక్కువ ధరకు పెట్రోల్‌, డీజిల్‌తో పాటు గ్యాస్‌ సరఫరాకు రష్యా అంగీకిరంచింది.