For Money

Business News

క్రిప్టో కరెన్సీలకు రష్యా ఓకే?

తమ దేశానికి చెందిన పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలపై అమెరికా, యూరప్‌ దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యా ప్రత్యామ్నాయాలను వెతుకుతోంది. ఉక్రెయిన్‌పై దాడుల తరవాత రష్యాపై అమెరికా, యూరప్‌ దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు క్రిప్టో కరెన్సీలను రష్యా చట్టబద్ధం చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. దాదాపు లక్ష డాలర్ల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు నిన్న అమెరికా ప్రకటించింది. అయితే క్రిప్టోకరెన్సీ ద్వారా ఈ ఆంక్షలను నుంచి తప్పించుకోవడం రష్యాకు చాలా సులభమని సీఎన్‌ఎన్‌ పేర్కొంది. ఒకవేళ రష్యా గనుక క్రిప్టో కరెన్సీలను ఆమోదించే పక్షంలో… అమెరికా ఆంక్షల నుంచి ఆ దేశం సునాయాసంగా బయటపడినట్లే. గురువారం 35000 డాలర్లకు దిగువకు పడిపోయి బిట్‌ కాయిన్‌ బైడెన్‌ ఆంక్షల ప్రకటన తరవాత 39000 డాలర్లకు చేరుకుంది. అమెరికా, యూరప్‌ ఆంక్షల నేపథ్యంలో వీటి నుంచి తప్పించుకోవడానికి క్రిప్టో కరెన్సీని ఆమోదించడం వినా రష్యాకు మరో మార్గం లేదని న్యూయార్క్‌ టైమ్స్‌ కూడా రాసింది.