For Money

Business News

ఈసారి డౌజోన్స్ వంతు

నిన్న నాస్‌డాక్‌ భారీ లాభాలతో క్లోజ్‌ కాగా ఇవాళ నష్టాలతో ప్రారంభమైంది. తరవాత కొద్దిసేపటికి లాభాల్లోకి వచ్చింది. ఇపుడు కూడా నామ మాత్రపు లాభంతో ఉంది. కాని ఇవాళ ఆశ్చర్యకరంగా డౌజోన్స్‌ ఏకంగా ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.8 శాతం లాభంతో ట్రేడవుతోంది. చర్చలకు తాము సిద్ధమైనని రష్యా ప్రకటించడంతో చాలా వరకు అన్ని మార్కెట్లలో సాధారణ స్థాయి నెలకొంది. భారీగా పెరిగిన కరెన్సీ, కమాడిటీ, క్రూడ్‌ ఆయిల్‌ మార్కెట్లు చల్లబడ్డాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు పోయిన నష్టాలను సాధించుకునే యత్నం చేస్తున్నాయి. ఇవాళ యూరో మార్కెట్లన్నీ దాదాపు మూడు శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. ప్రధాన మార్కెట్లు కూడా ఈ స్థాయి లాభాలతో ఉండటంతో యూరో స్టాక్స్ 50 సూచీ 3.10 శాతం లాభంతో ఉంది.