For Money

Business News

అయ్యో… బంగారం

బులియన్‌ ర్యాలీ ఏక్‌ దిన్‌ కా సుల్తానాలా మారింది. నిన్న భారీగా పెరిగిన బులియన్ ధరలు ఇవాళ ఢమాల్‌ అన్నాయి. స్పాట్‌తో పాటు ఫ్యూచర్స్‌లో బంగారం ధర గణీయంగా తగ్గింది. నిన్న బంగారంతో పాటు డాలర్‌ కూడా పెరగడంతో మన మార్కెట్‌లో భారీ లాభాలు వచ్చాయి. ఇవాళ బంగారంతో పాటు డాలర్ కూడా తగ్గడంతో నష్టాలు కూడా భారీగానే ఉన్నాయి. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో ఏప్రిల్‌ డెలివరీ బంగారం ధర రూ.1,332 తగ్గి రూ. 50,211 వద్ద ట్రేడవుతోంది. అలాగే కిలో వెండి మార్చి నెల కాంట్రాక్ట్ ధర కూడా రూ.2,008 తగ్గి రూ.65,121 వద్ద ట్రేడవుతోంది.