రూపాయి మరింత బలహీనం

విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్) మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మరింత బలహీనపడింది. ఇవాళ ఒక్కరోజే 54 పైసలు క్షీణించడంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ 74.99కి చేరింది. ఇవాళ కూడా అమెరికా మార్కెట్‌లో డాలర్ మరింత బలపడింది. దీంతో రేపు రూపాయి మరింత బలహీనపడే అవకాశముంది. డాలర్‌తో పాటు క్రూడ్ ధరలు పెరుగుతుండటంతో దేశీయ మార్కెట్‌లో డాలర్‌కు డిమాండ్ పెరుగుతోంది. అలాగే స్టాక్ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు షేర్లను అమ్ముతున్నారు. ఇవాళ కూడా మార్కెట్‌లోరూ.1,915 నికర అమ్మకందారులుగా నిలిచారు. అంటే కొనుగోళ్ళ కన్నా అమ్మకాలు అధికంగా ఉన్నాయన్నమాట.