For Money

Business News

ఆల్‌ టైమ్‌ కనిష్ఠ స్థాయికి రూపాయి పతనం

విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి పతనం మళ్ళీ ప్రారంభమైంది. గత కొన్ని రోజులుగా కోలుకున్నట్లే రూపాయి కన్పించినా.. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌, క్రూడ్‌ ఆయిల్ ధరలు పెరగడంతో… రూపాయిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఇవాళ ఓపెనింగ్‌లోనే డాలర్‌తో రూపాయి విలువ 82.33ని తాకింది. అదే ఫార్వర్డ్‌ మార్కెట్‌ USD INR అక్టోబర్‌ కాంట్రాక్ట్‌ 82.4775ని తాకింది. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్ ధరలు ఇపుడు 94.5 డాలర్ల వద్ద ఉన్నాయి. ఆయిల్‌ సరఫరాను తగ్గించాలని ఒపెక్‌ నిర్ణయించడంతో… క్రూడ్‌ మళ్ళీ 100 డాలర్లకు చేరే అవకాశముంది. ఇదే జరిగితే రూపాయి 83 స్థాయిని బ్రేక్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.